పరమగీతము 8:13-14
పరమగీతము 8:13-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఉద్యానవనములలో పెంచబడినదానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.
పరమగీతము 8:13-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఉద్యానవనాల్లో నివసించేదానా నీ చెలికత్తెలు నీతో ఉండగా, నీ స్వరం విననివ్వు. నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.
పరమగీతము 8:13-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.
పరమగీతము 8:13-14 పవిత్ర బైబిల్ (TERV)
ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి. నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి. జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.