రూతు 4:13-16
రూతు 4:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను. అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.
రూతు 4:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక. నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.
రూతు 4:13-16 పవిత్ర బైబిల్ (TERV)
బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. ఆ ఊరిలో స్త్రీలు నయోమితో, “నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు. అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు, అతడే నీకు బలాన్ని యిచ్చి, నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక! నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది. ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది. ఆమెకు నీవంటే చాలా ప్రేమ. ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.” అని అనిరి. నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది.
రూతు 4:13-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది. అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: “ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక! అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది.” నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది.