రోమా 7:14-20
రోమా 7:14-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కనుక పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. నేను చేయవలసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయదలచిన దానిని నేను చేయలేదు కాని నేను దేనినైతే ద్వేషిస్తానో దానినే చేశాను. నేను ఏదైతే చేయకూడదని అనుకున్నానో దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కనుక, నేను మంచిని జరిగించాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, నేను దేనినైతే చేయకూడదు అని అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
రోమా 7:14-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని. ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దాన్ని కాక దేన్ని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను. నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
రోమా 7:14-20 పవిత్ర బైబిల్ (TERV)
ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.
రోమా 7:14-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.
రోమా 7:14-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కాబట్టి పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. నేను చేసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయాలనుకున్న దానిని చేయలేదు కాని దేనిని ద్వేషిస్తానో దానినే చేశాను. చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.