రోమా 15:18-19
రోమా 15:18-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపెట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
రోమా 15:18-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని ఆత్మ యొక్క శక్తి వలన నేను చెప్పిన చేసిన అద్బుతాలు సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను. కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.
రోమా 15:18-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
రోమా 15:18-19 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను.
రోమా 15:18-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను. కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.