ప్రకటన 5:5-9

ప్రకటన 5:5-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

పెద్దలలో ఒకరు నాతో, “ఏడ్వకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపు చుట్టను తెరవగలవాడు” అన్నాడు. అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూసాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు. ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్ళి అతని కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొన్నాడు. ఆయన ఆ గ్రంథపు చుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణెను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకొన్నారు. వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కొరకు విడిపించడానికి నీవు వధింపబడి నీ రక్తంతో కొన్నావు.

షేర్ చేయి
Read ప్రకటన 5

ప్రకటన 5:5-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు. సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు. గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు.

షేర్ చేయి
Read ప్రకటన 5

ప్రకటన 5:5-9 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు. అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు

షేర్ చేయి
Read ప్రకటన 5

ప్రకటన 5:5-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ పెద్దలలో ఒకడు–ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలోనుండి ఆ గ్రంథమును తీసికొనెను. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

షేర్ చేయి
Read ప్రకటన 5

ప్రకటన 5:5-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

పెద్దలలో ఒకరు నాతో, “ఏడవకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపుచుట్టను తెరవగలరు” అన్నాడు. అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు. ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్లి ఆయన కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకున్నాడు. ఆయన ఆ గ్రంథపుచుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకున్నారు. వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.

షేర్ చేయి
Read ప్రకటన 5