కీర్తనలు 72:1-17

కీర్తనలు 72:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనచేయు దురు దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

కీర్తనలు 72:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి. ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక. పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక. ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక. ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా, భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక. ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు. ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు. తన శత్రువులు మట్టిని నాకుతారు. తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు. రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక. అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు. ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, పేదవారిని మరణం నుండి రక్షిస్తారు. ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది. రాజు దీర్ఘకాలం జీవించును గాక! షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. రోజంతా ఆయనను స్తుతించుదురు గాక. దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; కొండల పైభాగాన అది ఆడించబడును గాక. పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక. ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక.

కీర్తనలు 72:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి. అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక. నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక. ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక. కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక. అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక. సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక. ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక. తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక. రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక. ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు. నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు. బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది. రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక. దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక. రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.

కీర్తనలు 72:1-17 పవిత్ర బైబిల్ (TERV)

దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము. రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము. నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము. నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము. దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము. పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక. నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము. సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము. నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము. అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము. చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము. సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము. అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము. తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక. షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక. రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక. రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక. మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు. పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు. వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు. ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం. రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక. షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక. రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రతిరోజూ అతణ్ణి దీవించండి. పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. కొండలు పంటలతో నిండిపోవునుగాక. పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక. పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక. రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక. సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక. అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక. మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.

కీర్తనలు 72:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనచేయు దురు దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

కీర్తనలు 72:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)