కీర్తనలు 71:1-3
కీర్తనలు 71:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.
కీర్తనలు 71:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి. మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి. నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
కీర్తనలు 71:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు. నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు. నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.
కీర్తనలు 71:1-3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను. నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు. నా మాట వినుము. నన్ను రక్షించుము. భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
కీర్తనలు 71:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.
కీర్తనలు 71:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)