కీర్తనలు 65:1-4
కీర్తనలు 65:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.
కీర్తనలు 65:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము. మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు. మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు. మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.
కీర్తనలు 65:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది. ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు. మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు. నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.
కీర్తనలు 65:1-4 పవిత్ర బైబిల్ (TERV)
సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను. నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు. మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు. దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
కీర్తనలు 65:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.
కీర్తనలు 65:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)