కీర్తనలు 60:1-4
కీర్తనలు 60:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర గొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు. (సెలా.)
కీర్తనలు 60:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి! మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది. మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు. సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. సెలా
కీర్తనలు 60:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి. నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి. నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు. సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు.
కీర్తనలు 60:1-4 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్ధరించుము. భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతోంది. దయచేసి దాన్ని బాగు చేయుము. నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు. త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము. నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
కీర్తనలు 60:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర గొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు. (సెలా.)
కీర్తనలు 60:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)