కీర్తనలు 45:10-17
కీర్తనలు 45:10-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో. రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు. తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు. అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి. అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు. వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు. నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు. నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.
కీర్తనలు 45:10-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో. ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు. తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు. అంతఃపురంలో ఉన్న రాజకుమారి వైభవంగా ఉంది. ఆమె దుస్తులు బంగారంతో నేసినవి. వివిధ రంగులతో అల్లిక చేసిన దుస్తులు వేసుకున్న ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆమె వెంట ఆమెను అనుసరించే ఆమె చెలికత్తెలైన కన్యలను నీ దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆనందోత్సాహలతో వాళ్ళను తీసుకువస్తున్నారు. వాళ్ళంతా రాజ భవనంలో ప్రవేశిస్తున్నారు. నీ పితరులకు బదులుగా నీ పిల్లలుంటారు. వాళ్ళను నువ్వు భూమి అంతట్లో అధిపతులుగా నియమిస్తావు. అన్ని తరాల్లోనూ నీ నామం జ్ఞాపకం ఉండేలా నేను చేస్తాను. కాబట్టి ప్రజలు అన్ని తరాల్లో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
కీర్తనలు 45:10-17 పవిత్ర బైబిల్ (TERV)
కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము. రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘనపరుస్తావు. తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు. రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది. ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది. ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు. రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు. దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు. నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను. శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
కీర్తనలు 45:10-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.
కీర్తనలు 45:10-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)