కీర్తనలు 45:10-17

కీర్తనలు 45:10-17 OTSA

కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో. రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు. తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు. అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి. అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు. వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు. నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు. నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.