కీర్తనలు 35:13-18
కీర్తనలు 35:13-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను.
కీర్తనలు 35:13-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు, వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు నేను దుఃఖించాను. నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు నేను దుఃఖంతో క్రుంగిపోయాను. నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు. భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; వారు నన్ను చూసి పళ్ళు కొరికారు. ప్రభువా, ఎంతకాలం మీరిలా చూస్తూ ఉంటారు? వారి విధ్వంసం నుండి నన్ను కాపాడి, ఈ సింహాల నుండి నా విలువైన ప్రాణాన్ని విడిపించండి. మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
కీర్తనలు 35:13-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను. అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను. కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు. గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు. ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు. అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.
కీర్తనలు 35:13-18 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది. ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను. అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను. వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు. నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు. యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
కీర్తనలు 35:13-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను.
కీర్తనలు 35:13-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)