కీర్తనలు 35:13-18

కీర్తనలు 35:13-18 TSA

అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు, వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు నేను దుఃఖించాను. నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు నేను దుఃఖంతో క్రుంగిపోయాను. నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు. భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; వారు నన్ను చూసి పళ్ళు కొరికారు. ప్రభువా, ఎంతకాలం మీరిలా చూస్తూ ఉంటారు? వారి విధ్వంసం నుండి నన్ను కాపాడి, ఈ సింహాల నుండి నా విలువైన ప్రాణాన్ని విడిపించండి. మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.