కీర్తనలు 18:37-50
కీర్తనలు 18:37-50 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. వారు మళ్ళీ లేవకుండా వారిని నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు. మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు. మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను. వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు. గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు. విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు. వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షకుడైన దేవునికి మహిమ! నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే. నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు. అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీ నామ సంకీర్తన చేస్తాను. ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.
కీర్తనలు 18:37-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు. వాళ్ళు లేవలేనంతగా వాళ్ళను చితకగొట్టాను. వాళ్ళు నా కాళ్ళ కింద పడ్డారు. యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు. నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు. అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను. ప్రజల కలహాల నుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు. నా గురించి వినగానే వాళ్ళు నాకు లోబడుతున్నారు. పరదేశులు బలవంతంగా నాకు సాష్టాంగపడ్డారు. తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు. యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక. ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు. అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను! దేవుడు తన రాజుకు గొప్ప జయం ఇస్తాడు. తాను అభిషేకించిన వాడికి, దావీదుకు అతని సంతానానికి, శాశ్వతంగా ఆయన తన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తాడు.
కీర్తనలు 18:37-50 పవిత్ర బైబిల్ (TERV)
నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు. నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు. దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము. నా శత్రువులంతా నా యెదుట పడిపోయేటట్టు చేయుము. యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను. నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కాని ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు. వారు యెహోవాకు కూడా మొరపెట్టారు. కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు. నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను. నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు. ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు. ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు. యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి. నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు. యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు. కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను. యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.
కీర్తనలు 18:37-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురువారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్తాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు
కీర్తనలు 18:37-50 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)