కీర్తనలు 14:1-7

కీర్తనలు 14:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు. వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు. అందరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా లేరు. కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు. వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు, ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు. కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, కాని యెహోవా వారి ఆశ్రయము. సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది; యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

కీర్తనలు 14:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు. వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు. ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా? వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు. యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు. సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.

కీర్తనలు 14:1-7 పవిత్ర బైబిల్ (TERV)

“దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు. పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు. (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.) కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. కనీసం ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు. దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు. దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక. సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

కీర్తనలు 14:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

–దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగు నట్లు నా ప్రజలను మ్రింగుచు పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవావారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతో షించును.

కీర్తనలు 14:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)