కీర్తనలు 136:23-26
కీర్తనలు 136:23-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 136:23-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
కీర్తనలు 136:23-26 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. పరలోకపు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనలు 136:23-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.