కీర్తనలు 10:1-15

కీర్తనలు 10:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు? దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు. వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు. దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు. వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు. “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు. వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి. వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి; గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు. “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు. యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. నిస్సహాయులను మరువకండి. దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు? “దేవుడు నన్ను లెక్క అడగరు” అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు? దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు. దుష్టుల చేతిని విరగ్గొట్టండి. కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.

కీర్తనలు 10:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, నువ్వెందుకు దూరంగా నిలిచి ఉంటావు? ఆపద సమయాల్లో నువ్వెందుకు దాగి ఉంటావు? తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి. దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు. దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు. అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు. నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు. అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది. గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి. గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు. అతని బాధితులు నలిగిపోయి దెబ్బలు తింటారు. వాళ్ళు అతని బలమైన వలల్లో పడిపోతారు. దేవుడు మరచిపోయాడు, ఆయన తన ముఖం కప్పుకున్నాడు, ఆయనకు చూసే ఉద్దేశం లేదు, అని తన హృదయంలో అనుకుంటాడు. యెహోవా లేచి రా. దేవా, నీ చెయ్యెత్తి తీర్పు తీర్చు. పీడితులను మరిచిపోవద్దు. నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు? నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు. దుష్టల, దురాత్ముల చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి.

కీర్తనలు 10:1-15 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు? కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు. గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు. మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు. దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు. లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు. ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు. వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు. ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు. కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు. దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు. వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు. “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు. ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు. దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు. ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు. ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు. నిర్దోషులను వారు చంపుతారు. తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు. ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు. పేదలను, బాధపడేవారిని, ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు. అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు! దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు! మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!” యెహోవా, లేచి ఏదైనా చేయుము! దేవా, దుష్టులను శిక్షించుము! పేదలను మాత్రం మరువకుము! దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు? ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక. యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు. నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము. ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు. యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము. యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.

కీర్తనలు 10:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు? దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు కొందురు గాక దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అంద కుండును.వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరిం తురు. –మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచి యుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు. –దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అనివారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి యెత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అను కొనుటయేల? నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతి కారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానిని గూర్చి విచారణ చేయుము.

కీర్తనలు 10:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)