సామెతలు 29:15-27

సామెతలు 29:15-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలునువారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు. నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.

సామెతలు 29:15-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు. దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు. మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు. దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు. సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు. త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ. చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు. ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు. గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు. దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు. మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు. పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది. నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.

సామెతలు 29:15-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు. దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు. నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు. ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు. సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు. తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు. ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి. కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు. ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు. దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు. భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే. మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.

సామెతలు 29:15-27 పవిత్ర బైబిల్ (TERV)

దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు. దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు. నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు. ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కాని దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది. ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు. ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలోచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది. నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు. కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు. ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు. కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు. భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు. చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే. నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు.

సామెతలు 29:15-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలునువారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు. నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.

సామెతలు 29:15-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)