సామెతలు 29:15-27

సామెతలు 29:15-27 OTSA

బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు. దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు. మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు. దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు. సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు. త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ. చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు. ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు. గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు. దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు. మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు. పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది. నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.