సామెతలు 27:1-14

సామెతలు 27:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు. నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి. రాయి భారం ఇసుక ఒక భారం, మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము. కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు? అంతరంగంలో ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది. తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు. అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది. నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు. నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము; అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు. అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి. ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే, అది శాపంగా పరిగణించబడింది.

సామెతలు 27:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి. రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు. క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు? లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు. కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది. తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి. నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది. కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను. బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. జ్ఞానం లేనివారు నిర్లక్ష్యంగా ఆపదలో పడతారు. ఎదుటి మనిషి విషయంలో హామీ ఉండే వాడి నుంచి అతని వస్త్రం తీసుకో. ఇతరుల కోసం పూచీ తీసుకున్న వాడిచేత వాడి వస్తువులు తాకట్టు పెట్టించు. పొద్దున్నే లేచి పెద్ద గొంతుకతో తన స్నేహితుణ్ణి దీవించే వాడి దీవెన అతని పాలిట శాపమే.

సామెతలు 27:1-14 పవిత్ర బైబిల్ (TERV)

భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు. మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం. కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం. దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు. ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు. నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే. తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు. పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధురమైన హితవు వుంటుంది. నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది. నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను. జ్ఞానముగల వారు కష్టం రావడం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు. మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు. “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.

సామెతలు 27:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును. తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.

సామెతలు 27:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)