సామెతలు 26:13-28
సామెతలు 26:13-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
సామెతలు 26:13-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు. తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు. తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు. కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది. నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి. చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి. పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు. వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి. వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది. గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది. అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.
సామెతలు 26:13-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు. బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు. కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం. సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు. తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం. తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం. కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది. నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు. కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి. చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం. పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి. వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది. గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది. అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.
సామెతలు 26:13-28 పవిత్ర బైబిల్ (TERV)
“నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి. ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు. ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు. ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది. మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు. మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది. బొగ్గులు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. కట్టెలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బ్రతకనిస్తారు. మనుష్యులు చెప్పుడు మాటలను ప్రేమిస్తారు. అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది. ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి. ఒక దుర్మార్గుడు తాను చెప్పే విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్టు కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను తన హృదయంలో దాచి పెడతాడు. అతడు చెప్పే విషయాలు మంచివిగా కనబడవచ్చు. కాని అతణ్ణి నమ్మవద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది. అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. చివరికి అతడు చేసే దుర్మార్గవు విషయాలను మనుష్యులందరు చూస్తారు. ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతిలో పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దొర్లించాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక గొట్టుకుంటాడు. అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.
సామెతలు 26:13-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
సామెతలు 26:13-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)