సామెతలు 26

26
1వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో,
అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు.
2ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో,
కారణం లేని శాపం కూడా నిలువదు.
3గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం,
బుద్ధిహీనుని వీపుకు బెత్తం!
4వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు,
ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు.
5వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి,
లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.
6బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు,
కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు.
7కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు,
అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు.
8బుద్ధిహీనుని గౌరవించువాడు,
వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు.
9బుద్ధిహీనుని నోట సామెత,
మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును.
10యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె
బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును.
11తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు
తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.
12తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా?
వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.
13సోమరి అంటాడు, “దారిలో సింహముంది,
వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!”
14కీలుపై తలుపు తిరుగుతుంది
అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు.
15సోమరి పాత్రలో చేయి ముంచునేగాని;
తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
16కారణాలు చూపగల ఏడుగురి కంటే
సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.
17తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు
దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు.
18-19తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన
“నేను సరదాగా చేశాను!” అని అనేవాడు
మండుతున్న బాణాలు విసిరే
ఉన్మాది లాంటివాడు.
20కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది;
అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.
21నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో
గొడవలు రేపడానికి గొడవప్రియుడు.
22పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి
అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
23చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన#26:23 హెబ్రీలో మృదువైన మాటలు
మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.
24పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి
హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు.
25వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు,
వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి.
26వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు,
కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది.
27గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు
రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది.
28అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది,
అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 26: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి