సామెతలు 10:21-28
సామెతలు 10:21-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు. చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
సామెతలు 10:21-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు. బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు. దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది. సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు. పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు. యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి. నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.
సామెతలు 10:21-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు. యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది. మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు. మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది. సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు. సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది. నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.
సామెతలు 10:21-28 పవిత్ర బైబిల్ (TERV)
ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కాని బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తుంది. యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు. బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కాని జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కాని మంచివాడు తాను కోరుకొనే వాటిని పొందుతాడు. సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుతారు. కాని మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు. బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు. నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బ్రతుకుతావు. కాని దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు. మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.
సామెతలు 10:21-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు. చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
సామెతలు 10:21-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)