సామెతలు 10:21-28

సామెతలు 10:21-28 TERV

ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కాని బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తుంది. యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు. బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కాని జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కాని మంచివాడు తాను కోరుకొనే వాటిని పొందుతాడు. సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుతారు. కాని మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు. బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు. నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బ్రతుకుతావు. కాని దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు. మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.