సంఖ్యాకాండము 7:1-41
సంఖ్యాకాండము 7:1-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి, దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమతమపితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొనివచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొనివచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను. అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను. కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమతమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవదినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. నాలుగవదినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. అయిదవదినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.
సంఖ్యాకాండము 7:1-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు. ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల నాయకులు, తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు బలులు అర్పించారు. వీరు తమ తమ గోత్రాల ప్రజలను నడిపిస్తున్నవారు. జనాభా లెక్కలను పర్యవేక్షించింది వీరే. వీరు తమ అర్పణలను యెహోవా సమక్షంలోకి తీసుకు వచ్చారు. వీరు ఆరు గూడు బళ్ళూ, పన్నెండు ఎద్దులను తీసుకు వచ్చారు. ఇద్దరు నాయకులకు ఒక బండినీ, ఒక్కొక్కరికీ ఒక ఎద్దునీ తీసుకు వచ్చారు. వీటిని మందిరం ఎదుటికి వారు తీసుకు వచ్చారు. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు. “వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.” మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు. వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు. యాజకుడు అహరోను కొడుకు ఈతామారు పర్యవేక్షణ లో పనిచేసే మెరారి వంశస్తులకి వారు చేసే సేవను బట్టి నాలుగు బళ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు. అయితే కహాతు వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వారి సేవ అంతా మందిరంలోని సామగ్రికీ వస్తువులకీ సంబంధించింది. వాటిని వారు తమ భుజాలపై మోసుకు వెళ్ళాలి. కాబట్టి వారికి బళ్ళు ఇవ్వలేదు. మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు. యెహోవా మోషేకి “బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు” అని ఆదేశించాడు. మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు. వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు. ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు. పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు. రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం. రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన సన్నని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు. అతడింకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను ఇచ్చాడు. దహన బలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు. పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు. అలాగే అతడు శాంతిబలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది సూయారు కొడుకు నెతనేలు తెచ్చిన అర్పణం. మూడో రోజు జెబూలూను వంశస్తులకు నాయకుడూ హేలోను కొడుకూ అయిన ఏలీయాబు తన అర్పణ తీసుకు వచ్చాడు. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు. ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు. ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు. పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు. శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం. నాలుగో రోజు రూబేను వంశస్తుల నాయకుడూ, షెదేయూరు కొడుకూ అయిన ఏలీసూరు తన అర్పణ తీసుకు వచ్చాడు. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు. ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు. అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు. పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు. ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం. ఐదో రోజు షిమ్యోను వంశస్తుల నాయకుడూ, సూరీషదాయి కొడుకూ అయిన షెలుమీయేలు తన అర్పణం తీసుకు వచ్చాడు. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెను, 70 తులాల బరువున్న వెండి పాత్రను, సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు. ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు. ఇతడు దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రె పిల్లనూ తీసుకువచ్చాడు. ఒక మేకపోతును పాపం కోసం చేసే బలిగా ఇచ్చాడు. ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది సూరీషదాయి కొడుకు షెలుమీయేలు అర్పణం.
సంఖ్యాకాండము 7:1-83 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది. అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లెక్కబెట్టారు. ఈ నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు. మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నాయకుల దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.” కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. ఆ మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు బాధ్యుడు. కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని. బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు. “ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు. పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా: ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది. ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి. మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడు, అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తన అర్పణలు తీసుకొని వచ్చాడు. రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడు, అమీహోదు కుమారుడైన ఎలీషామా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాని తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడు, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
సంఖ్యాకాండము 7:1-41 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు. తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు. వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు. యెహోవా మోషేతో, “సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.” కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు. అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు, అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు. కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు. బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు, నాయకులు ప్రతిష్ఠార్పణలు తెచ్చి, బలిపీఠం ముందుంచారు. యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.” మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తెచ్చిన అర్పణ. రెండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఇశ్శాఖారు గోత్ర నాయకుడు, నెతనేలు కుమారుడైన సూయరు. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, ఒక సంవత్సరపు అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది నెతనేలు కుమారుడైన సూయరు తెచ్చిన అర్పణ. మూడవ రోజు అర్పణను తెచ్చిన వారు జెబూలూను గోత్ర నాయకుడు, హేలోను కుమారుడైన ఏలీయాబు. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు తెచ్చిన అర్పణ. నాలుగవ రోజు అర్పణను తెచ్చిన వారు రూబేను గోత్ర నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఎలీసూరు. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది ఎలీసూరు కుమారుడైన షెదేయూరు తెచ్చిన అర్పణ. అయిదవ రోజు అర్పణను తెచ్చిన వారు షిమ్యోను గోత్ర నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తెచ్చిన అర్పణ.