యెహోషువ 19:1-48

యెహోషువ 19:1-48 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది. వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా, హజర్-షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా, బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు, ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు. ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ. ఇది షిమ్యోనీయుల గోత్రం వారి వంశాల ప్రకారం వచ్చిన వారసత్వము. యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు. మూడవ చీటి జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వచ్చింది: వారి వారసత్వపు సరిహద్దు శారీదు వరకు వెళ్లింది. అది పడమటి వైపుగా మరాలా వరకు వెళ్లి దబ్బేషేతును తాకి, యొక్నీము సమీపంలోని లోయవరకు విస్తరించింది. ఇది శారీదు నుండి సూర్యోదయం వైపు కిస్లోత్-తాబోరు భూభాగానికి తూర్పుగా తిరిగి దాబెరతు, యాఫీయా వరకు వెళ్లింది. తర్వాత తూర్పు వైపు గాత్-హెఫెరు, ఎత్ కాజీను వరకు కొనసాగింది; అది రిమ్మోను దగ్గరకు వచ్చి నేయా వైపు తిరిగింది. అక్కడ సరిహద్దు ఉత్తరాన హన్నాతోను వరకు వెళ్లి ఇఫ్తా ఎల్ లోయ దగ్గర ముగిసింది. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది. వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, ఎబెస్ రెమెతు, ఎన్-గన్నీము, ఎన్-హద్దా, బేత్-పస్సెసు ఉన్నాయి. దాని సరిహద్దు తాబోరు, షహజుమా, బేత్-షెమెషులను తాకి యొర్దాను నది దగ్గర ముగిసింది. పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు ఇశ్శాఖారు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. అయిదవ చీటి వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రానికి వచ్చింది. వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్షఫు, అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది. అది తూర్పున బేత్-దాగోను వైపు తిరిగి, జెబూలూను, ఇఫ్తా ఎల్ లోయను తాకి, ఉత్తరాన బేత్-ఎమెకు, నెయీయేలులకు వెళ్లి ఎడమవైపున కాబూల్ దాటింది. అది మహా సీదోను వరకు అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు వెళ్లింది. ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది. ఉమ్మా, ఆఫెకు, రెహోబు కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలు, వాటి గ్రామాలు. ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది. వారి సరిహద్దు హెలెఫు జయనన్నీములోని సింధూర వృక్షం నుండి అదామి నెకెబు, జబ్నీలులను దాటి లక్కూముకు వెళ్లి యొర్దాను దగ్గర ముగిసింది. దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది. కోటగోడలు గలవారి పట్టణాలు: జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయీ, ఎన్-హాసోరు, ఇరోను, మిగ్దల్-ఏలు, హొరేము, బేత్-అనాతు, బేత్-షెమెషు, పందొమ్మిది పట్టణాలు, వారి గ్రామాలు. వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు వాటి గ్రామాలు ఇవి. ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది. వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు, షయల్బీను, అయ్యాలోను, ఇత్లా, ఎలోను, తిమ్నా, ఎక్రోను, ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు, యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను, మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం. కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు. వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి.

యెహోషువ 19:1-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది. వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా, బేత్లబాయోతు, షారూహెను అనేవి, వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు. దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం. షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది. మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది. వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది. అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది. దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది. వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు. ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెతు, ఏన్గన్నీము, ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు చేరి యొర్దాను దగ్గర అంతమయింది. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు, అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు. వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది. వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది. అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది. ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు. ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా, ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను, అయ్యాలోను, యెతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యెహుదు, బెనేబెరకు, గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం. దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు. వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:1-48 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది. వారికి లభించిన భూమి యిది; బెయెర్‌షెబ (షెబ) మోలాదా, హజర్‌షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బెతూలు, హొర్మా సిక్లగు, బెత్‌మార్కాబొదు, హజర్‌సుస బెత్‌లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. బాలాత్ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. (ఇది నెగెవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు లభించాయి. షిమ్యోనీ ప్రజల భూమి యూదా భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటె చాలా ఎక్కువ భూమి ఉంది. కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత భాగం లభించింది. తర్వాత భూమి లభించిన వంశం జెబూలూను. జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను సరిహద్దు శారీదు వరకు విస్తరించింది. తర్వాత అది పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు ప్రాంతానికి సమీంపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. శారీదు నుండి అది కిస్లోత్ తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు. యాఫియకు విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్‌హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది. నేయావద్ద ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. ఆ సరిహద్దు హన్నాతొన్ వరకు విస్తరించి, ఇఫ్తాయెల్ లోయవరకు కొనసాగింది. ఈ సరిహద్దు లోపల కట్టాత్, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లేహేము పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి. కనుక జెబూలూనుకు లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబూలూను ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది. నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. ఆ కుటుంబాలకు వారికి ఇవ్వబడిన భూమి యిది; యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనాహరతు రబ్బితు, కిష్యోను, ఎబెజు రెమెతు, ఎన్‌గన్నిము, ఎన్‌హద్దా, బెత్‌పెసెసు. వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెత్‌షెమెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు యొర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి. ఈ పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడిన దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది. దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ భూమిలో కొంత లభించింది. ఆ వంశానికి ఇవ్వబడిన దేశం ఇది; హెల్కతు, హాలి, బెతెను, అక్షాపు, అలమ్మేలెకు, అమద్, మిషల్. పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు లిబ్నాతు వరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్ దాగొనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబూలూను, ఇఫెలు లోయలను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్, నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటిపోయింది. తర్వాత అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది. మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం లభించింది. నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది. వారి దేశ సరిహద్దు జయనన్నీములోని సింధూరవనము దగ్గర ప్రారంభమయింది. ఇది హెలెపు సమీపంలో ఉంది. తర్వాత ఆదామి, నెకెబు, యబ్నెయెలుగుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం ప్రాంతం వరకు విస్తరించి, యొర్దాను నది దగ్గర ముగిసింది. తర్వాత ఆ సరిహద్దు అస్నొతు తాబోరుగుండా పడమటికి వెళ్లింది. హుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణాన సరిహద్దు జెబూలూను ప్రాంతం వరకు వెళ్లింది. పశ్శిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. తూర్పున యొర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు వెళ్లింది. ఈ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరతు అదామా, రామా, హషొరు కెదెషు, ఎద్రేయి, ఎన్‌హసోరు ఇరోను, మిగ్దల్ ఎల్, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షెమెషు. మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు మొత్తము. ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది. తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది. వారికి ఇవ్వబడిన భూమి ఇది: జొర్యా, ఎష్తాయోలు, ఇర్‌షెమెషు షయల్బీను, అయ్యాలోను, ఇత్లా, ఎలోను, తిమ్నా, ఎక్రోను ఎలైకే, గిబ్బెతాను, బాలాతా యెహుదు బెనెబెరక్, గాత్ రిమ్మోను మేయర్కోను రక్కోను, యొప్ప దగ్గర ప్రాంతం. అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు. దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.

యెహోషువ 19:1-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశ స్థుల స్వాస్థ్యము మధ్యనుండెను. వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా బేత్లెబాయోతు షారూ హెను అనునవి, వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు. అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు. దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. మూడవవంతు చీటి వారి వంశములచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. వారి సరిహద్దు పడమటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కాచీను వరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము. నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబెసు రెమెతు ఏన్గన్నీము ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దానువరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతోకూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతు హలి, బెతెను, అక్షాపు అలమ్మేలెకు అమాదు మిషెయలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసావరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపెట్టి సముద్రమువరకు సాగెను. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతోకూడ అవి యిరువదిరెండు పట్టణములు. వాటి పల్లెలతోకూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూరవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూమువరకు సాగి అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరువరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను. కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తా లీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు –జొర్యా ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను అయ్యాలోను యెత్లా ఏలోను తిమ్నా ఎక్రోను ఎల్తెకే గిబ్బెతోను బాలాతా యెహుదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమపితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరుపెట్టిరి. వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

యెహోషువ 19:1-48 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)