యెహోషువ 12:7-24

యెహోషువ 12:7-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు. ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు. వారు జయించిన రాజు లెవరనగా: యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు యెరూషలేము రాజు ఒక్కడు హెబ్రోను రాజు ఒక్కడు యర్మూతు రాజు ఒక్కడు లాకీషు రాజు ఒక్కడు ఎగ్లోను రాజు ఒక్కడు గెజెరు రాజు ఒక్కడు దెబీరు రాజు ఒక్కడు గెదెరు రాజు ఒక్కడు హోర్మా రాజు ఒక్కడు అరాదు రాజు ఒక్కడు లిబ్నా రాజు ఒక్కడు అదుల్లాము రాజు ఒక్కడు మక్కేదా రాజు ఒక్కడు బేతేలు రాజు ఒక్కడు తప్పూయ రాజు ఒక్కడు హెఫెరు రాజు ఒక్కడు ఆఫెకు రాజు ఒక్కడు లషారోను రాజు ఒక్కడు మాదోను రాజు ఒక్కడు హాసోరు రాజు ఒక్కడు షిమ్రోను మెరోను రాజు ఒక్కడు అక్షఫు రాజు ఒక్కడు తానాకు రాజు ఒక్కడు మెగిద్దో రాజు ఒక్కడు కెదెషు రాజు ఒక్కడు కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు దోరు రాజు (నఫోత్ దోరు లోని) ఒక్కడు గిల్గాలులో గోయీం రాజు ఒక్కడు తిర్సా రాజు ఒక్కడు

యెహోషువ 12:7-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు. కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు. వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లష్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు. కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు, గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు. వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.

యెహోషువ 12:7-24 పవిత్ర బైబిల్ (TERV)

యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం లెబానోను లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి. కొండ దేశం, పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, ఎడారి, నెగెవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది: యెరికో రాజు. బేతేలు దగ్గరనున్న హాయి రాజు. యెరూషలేము రాజు. హెబ్రోను రాజు. యార్ముతు రాజు. లాకీషు రాజు. ఎగ్లోను రాజు. గెజెరు రాజు. దెబీరు రాజు. గెదెరు రాజు. హోర్మా రాజు. అరాదు రాజు. లిబ్నా రాజు. అదుల్లాం రాజు. మక్కెద రాజు. బేతేలు రాజు. తపువ రాజు. హెపెరు రాజు. అఫెకు రాజు. లాషారోను రాజు. మదోను రాజు. హిజోరు రాజు. షిమ్రోన్ మెరోన్ రాజు. అక్షపు రాజు. తానాకు రాజు. మెగిద్దో రాజు. కెదెషు రాజు. కర్మెలులోని యొకెనం రాజు. దోరు పర్వతంలో దోరు రాజు. గిల్గాలులోని గోయిం రాజు. తిర్సా రాజు.

యెహోషువ 12:7-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యొర్దానుకు ఇవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండవరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణదేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లష్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నెయాము రాజు, దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య ముప్పది యొకటి.

యెహోషువ 12:7-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)