యెహోషువ 12:7-24

యెహోషువ 12:7-24 TSA

యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు. ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు. వారు జయించిన రాజు లెవరనగా: యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు యెరూషలేము రాజు ఒక్కడు హెబ్రోను రాజు ఒక్కడు యర్మూతు రాజు ఒక్కడు లాకీషు రాజు ఒక్కడు ఎగ్లోను రాజు ఒక్కడు గెజెరు రాజు ఒక్కడు దెబీరు రాజు ఒక్కడు గెదెరు రాజు ఒక్కడు హోర్మా రాజు ఒక్కడు అరాదు రాజు ఒక్కడు లిబ్నా రాజు ఒక్కడు అదుల్లాము రాజు ఒక్కడు మక్కేదా రాజు ఒక్కడు బేతేలు రాజు ఒక్కడు తప్పూయ రాజు ఒక్కడు హెఫెరు రాజు ఒక్కడు ఆఫెకు రాజు ఒక్కడు లషారోను రాజు ఒక్కడు మాదోను రాజు ఒక్కడు హాసోరు రాజు ఒక్కడు షిమ్రోను మెరోను రాజు ఒక్కడు అక్షఫు రాజు ఒక్కడు తానాకు రాజు ఒక్కడు మెగిద్దో రాజు ఒక్కడు కెదెషు రాజు ఒక్కడు కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు దోరు రాజు (నఫోత్ దోరు లోని) ఒక్కడు గిల్గాలులో గోయీం రాజు ఒక్కడు తిర్సా రాజు ఒక్కడు