యోబు 36:27-29
యోబు 36:27-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు. మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి. నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?
యోబు 36:27-29 పవిత్ర బైబిల్ (TERV)
“దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని దాన్ని వర్షంగా మారుస్తాడు. ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది. దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు. దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు.
యోబు 36:27-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
యోబు 36:27-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది; మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?