యోబు 31:26-28
యోబు 31:26-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి, నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే, అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను.
యోబు 31:26-28 పవిత్ర బైబిల్ (TERV)
నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు. సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు. అలాంటివి ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేతనంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైనవాడి నవుతాను.
యోబు 31:26-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడివారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
యోబు 31:26-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి, నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే, అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.