యోబు 31

31
1నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని
కన్యకను నేనేలాగు చూచుదును?
2ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ
యేమగును?
ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
3దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా
పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.
4ఆయన నా ప్రవర్తన నెరుగును గదా
నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
5అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల
మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల
6నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి
కొనునట్లు
7న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక.
నేను త్రోవవిడిచి నడచినయెడల
నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన
యెడల
మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
8నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక
నేను నాటినది పెరికివేయబడును గాక.
9నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల
నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న
యెడల
10నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక
ఇతరులు ఆమెను కూడుదురు గాక.
11అది దుష్కామకార్యము
అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
12అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము
అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
13నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె
మాడగా
నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
14దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును?
ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి
ప్రత్యుత్తరమిత్తును?
15గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడ పుట్టింపలేదా?
గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
16బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను
విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను
17తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె
మైనను తిననియ్యక
నేను ఒంటరిగా భోజనముచేసినయెడలను
18ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను
బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను
19వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలనువారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన
యెడలను
20గుమ్మములో సహాయము దొరకుననుకొనిన
తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
21నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక
నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.
22నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని
దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి
నాయొద్ద పెరిగెను.
నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని
వానికి నేను మార్గదర్శినైతిని.
23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు
ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
24సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను
–నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో
నేను చెప్పినయెడలను
25నా ఆస్తి గొప్పదని గాని
నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను
సంతోషించినయెడలను
26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని
చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా
అతనినేగాని చూచి
27నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడివారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను
పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును.
28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర
మగును.
29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను
సంతోషించినయెడలను
అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించినయెడలను
30నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను
శపించలేదు
పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనేలేదు.
31–అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని
చూపింపగలవారెవరని
నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
32పరదేశిని వీధిలో ఉండనియ్యక
నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.
33ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
34మహా సమూహమునకు భయపడియు
కుటుంబముల తిరస్కారమునకు జడిసియు
నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక
రొమ్ములో నా పాపమును కప్పుకొనినయెడల
పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును
35నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో
కోరుచున్నాను;
ఇదిగో నా చేవ్రాలు గురుతు.
ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు
నాకుత్తరమిచ్చును గాక.
36నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి
కొందును
నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
37నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు
వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.
38నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను
దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
39క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను
దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన
యెడలను
40గోధుమలకు ప్రతిగా ముళ్లును
యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక.
యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 31: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి