యోబు 31:16-20
యోబు 31:16-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననియ్యక నేనొక్కడినే భోజనం చేస్తే, (నేను అలా చేయలేదు, నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి, ఆ వితంతువుకు దారి చూపించాను). ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే, వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే
యోబు 31:16-20 పవిత్ర బైబిల్ (TERV)
“పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు. నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు. నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను. ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు, నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
యోబు 31:16-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనముచేసినయెడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలనువారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను గుమ్మములో సహాయము దొరకుననుకొనిన తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
యోబు 31:16-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా, ఒకవేళ అనాధలకు పెట్టకుండా నేనే ఒంటరిగా భోజనం చేసినా కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను, నేను పుట్టినప్పటి నుండి విధవరాండ్రకు దారి చూపించాను; ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు, నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు