యిర్మీయా 33:15-16
యిర్మీయా 33:15-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
యిర్మీయా 33:15-16 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
యిర్మీయా 33:15-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.
యిర్మీయా 33:15-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’