యిర్మీయా 12:1-4

యిర్మీయా 12:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు? మీరు వారిని నాటారు, వారు వేర్లు పాదుకున్నారు; వారు పెరిగి ఫలిస్తున్నారు. వారెల్లప్పుడూ మీ గురించి మాట్లాడతారు కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఉంటాయి. అయినా యెహోవా, నేను మీకు తెలుసు; మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు. వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి! వధ దినం కోసం వారిని వేరు చేయండి! ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి జంతువులు, పక్షులు నశించాయి. “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” అని ప్రజలు అంటున్నారు.

యిర్మీయా 12:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు? వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు. వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే. యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు. దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు.

యిర్మీయా 12:1-4 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నేను నీతో వాదించినట్లయితే, నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు! కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను. దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు? నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు? ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి, అభివృద్ధిచెంది కాయలు కాసారు. నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు. కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు. ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు. నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు. గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి. సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి. ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు.

యిర్మీయా 12:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల? నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలవలెను వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.

యిర్మీయా 12:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)