యాకోబు 1:16-17
యాకోబు 1:16-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు.
యాకోబు 1:16-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
యాకోబు 1:16-17 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.
యాకోబు 1:16-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.