యెషయా 58:5-6
యెషయా 58:5-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
యెషయా 58:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా? ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా? నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.
యెషయా 58:5-6 పవిత్ర బైబిల్ (TERV)
ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా? “నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి.
యెషయా 58:5-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా? “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?