యెషయా 40:6-9
యెషయా 40:6-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది. గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.” సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.
యెషయా 40:6-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. “నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది. యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.” సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ, భయపడకుండా స్థిరంగా ప్రకటించు. “ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు.
యెషయా 40:6-9 పవిత్ర బైబిల్ (TERV)
ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు. మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది. యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది. ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది. సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి. గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.” సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు. యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. భయపడవద్దు. గట్టిగా మాట్లాడు. యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు: “చూడు, ఇదిగో మీ దేవుడు!
యెషయా 40:6-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి –ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
యెషయా 40:6-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)