హెబ్రీయులకు 4:1-7
హెబ్రీయులకు 4:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చి –నేను కోపముతో ప్రమాణముచేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు –దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే –వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో–నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
హెబ్రీయులకు 4:1-7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కనుక, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము. ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసివుండలేదు కనుక విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు. అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘గనుక వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు,’ అని నేను కోపంలో ప్రకటించాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు. దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ దినాన తన కార్యాలన్నిటిని ముగించి విశ్రమించారు.” పై వచనంలో ఆయన, “వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కనుక ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలుస్తున్నాడు. “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు.” అని ముందుగా వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలాకాలం తరువాత ఆయన దావీదు ద్వారా కూడా యిదే మాటను మాట్లాడారు.
హెబ్రీయులకు 4:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి. విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది. అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన, “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు. మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ, “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి, విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు. మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు. దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. కాబట్టి, ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు. కాబట్టి దేవుడు, “ఈ దినం” అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఇలా అన్నాడు, “మీరు మీ హృదయాలను కఠినపరచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు.”
హెబ్రీయులకు 4:1-7 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. “నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను: ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’” అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను” అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు
హెబ్రీయులకు 4:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కాబట్టి, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము. ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసి ఉండలేదు కాబట్టి విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు. అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘కాబట్టి వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు. దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ రోజున తన పనులన్నిటిని నుండి విశ్రాంతి తీసుకున్నారు.” పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలిచారు. వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలా కాలం తర్వాత ఆయన దావీదు ద్వారా కూడా ఇదే మాటను మాట్లాడారు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”