హెబ్రీయులకు 4:1-7

హెబ్రీయులకు 4:1-7 TCV

అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కనుక, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము. ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసివుండలేదు కనుక విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు. అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘గనుక వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు,’ అని నేను కోపంలో ప్రకటించాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు. దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ దినాన తన కార్యాలన్నిటిని ముగించి విశ్రమించారు.” పై వచనంలో ఆయన, “వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు. అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కనుక ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలుస్తున్నాడు. “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు.” అని ముందుగా వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలాకాలం తరువాత ఆయన దావీదు ద్వారా కూడా యిదే మాటను మాట్లాడారు.

హెబ్రీయులకు 4:1-7 కోసం వీడియో