హబక్కూకు 3:13-19

హబక్కూకు 3:13-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు. నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు, గొప్ప జలాలను చిలుకుతున్నావు. నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను. అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు.

హబక్కూకు 3:13-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు. దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా). పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు. నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు. నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి. నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది. అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా, నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.

హబక్కూకు 3:13-19 పవిత్ర బైబిల్ (TERV)

నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా, లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు. శత్రు సైనికులను ఆపటానికి నీవు మోషే చేతి కర్రను ఉపయోగించావు. ఆ సైనికులు మామీద యుద్ధానికి పెనుతుఫానులా వచ్చారు. రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు, వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు. కాని నీవు నీ గుర్రాలతో సముద్రంగుండా నడిచావు. ఆ మహా జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు. నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహీనమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది. అంజూరపు చెట్లు కాయలు కాయకుండా ఉండవచ్చు. ద్రాక్షచెట్లపై కాయలు ఉండక పోవచ్చు. చెట్లకు ఒలీవ పండ్లు కాయక పోవచ్చు. పొలాల్లో ఆహార ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు. అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను. నా రక్షకుడైన దేవునియందు నేను ఉల్లసిస్తాను. నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు. పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు.

హబక్కూకు 3:13-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండవారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా.) బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును. నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియం దు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడువజేయును.

హబక్కూకు 3:13-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)