నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు. నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు, గొప్ప జలాలను చిలుకుతున్నావు. నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను. అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు.
చదువండి హబక్కూకు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హబక్కూకు 3:13-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు