యెహెజ్కేలు 3:4-10

యెహెజ్కేలు 3:4-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి. నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను. నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు. కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు. వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను. నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.” ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో.

యెహెజ్కేలు 3:4-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి నా మాటలు వారికి చెప్పు. అపరిచితమైన మాటలు పలికే వాళ్ళ దగ్గరకో, కఠినమైన భాష మాట్లాడే వాళ్ళ దగ్గరకో నిన్ను పంపించడం లేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకే నిన్ను పంపిస్తున్నాను. నువ్వు వెళ్తున్నది నీకు అర్థం కాకుండా విచిత్రంగా పలికే బలమైన దేశం కాదు. లేదా కఠినమైన భాష మాట్లాడే దేశమూ కాదు! అలాంటి వాళ్ళ దగ్గరకి నిన్ను పంపితే వాళ్ళు నీ మాటలు వింటారు! కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు. ఇలా చూడు! నీ ముఖాన్ని వాళ్ళ ముఖాల్లాగే మూర్ఖంగానూ నీ నుదురును వాళ్ళ నుదుళ్ళ లాగే కఠినంగానూ చేశాను. నీ నుదురును వజ్రంలా చేశాను. దాన్ని చెకుముకి రాయి కంటే కఠినంగా చేశాను. వాళ్ళు తిరగబడే జాతి అని వాళ్ళకి నువ్వు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి నిరుత్సాహపడవద్దు.” తరువాత ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నేను నీకు చెప్పే మాటలను చెవులారా విను. వాటిని నీ మనసులో ఉంచుకో.

యెహెజ్కేలు 3:4-10 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.” ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి.

యెహెజ్కేలు 3:4-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపినయెడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలినవారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురువలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను. నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగాఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని

యెహెజ్కేలు 3:4-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)