యెహెజ్కేలు 3:24-27

యెహెజ్కేలు 3:24-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు దేవుని ఆత్మ నా దగ్గరకి వచ్చి నన్ను లేపి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆయన నాతో ఇలా మాట్లాడాడు. “నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి నీపై తాళ్ళు వేసి నిన్ను బంధిస్తారు. అందుకే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉండు. వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు. కానీ నేను నీతో మాట్లాడుతాను. వాళ్లకి ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు’ అని నువ్వు చెప్పడానికి నీ నోరు తెరుస్తాను. వాళ్ళు తిరుగుబాటు చేసే జనం కాబట్టి వినేవాడు వింటాడు. విననివాడు వినకుండానే ఉంటాడు.”

షేర్ చేయి
Read యెహెజ్కేలు 3

యెహెజ్కేలు 3:24-27 పవిత్ర బైబిల్ (TERV)

కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో. ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. నేను నీ నాలుకను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 3

యెహెజ్కేలు 3:24-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి–వినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 3

యెహెజ్కేలు 3:24-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో. మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను. కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 3