ప్రసంగి 3:1-6
ప్రసంగి 3:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది: పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి. వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి
ప్రసంగి 3:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది. పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ
ప్రసంగి 3:1-6 పవిత్ర బైబిల్ (TERV)
ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది. పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది. చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది. ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది. ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది. దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది, వాటిని పారవేసే సమయం వుంది.
ప్రసంగి 3:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు
ప్రసంగి 3:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)