ద్వితీయోపదేశకాండము 34:4
ద్వితీయోపదేశకాండము 34:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.”
ద్వితీయోపదేశకాండము 34:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.”
ద్వితీయోపదేశకాండము 34:4 పవిత్ర బైబిల్ (TERV)
“అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడనిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
ద్వితీయోపదేశకాండము 34:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా అతనితో ఇట్లనెను–నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితినిగాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
ద్వితీయోపదేశకాండము 34:4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)