ద్వితీయోపదేశకాండము 34:10-11
ద్వితీయోపదేశకాండము 34:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో
ద్వితీయోపదేశకాండము 34:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు.
ద్వితీయోపదేశకాండము 34:10-11 పవిత్ర బైబిల్ (TERV)
కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి.
ద్వితీయోపదేశకాండము 34:10-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పటినుండి ఇశ్రాయేలులో యెహోవా ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త, ఈజిప్టులో ఫరోకు, అతని అధికారులందరికి, అతని దేశమంతటికి సూచనలను, అద్భుతాలను చేయడానికి యెహోవా పంపిన అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేడు.