అపొస్తలుల కార్యములు 7:1-3
అపొస్తలుల కార్యములు 7:1-3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “సహోదరులారా మరియు తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ‘నీ దేశాన్ని మరియు నీ సొంత జనాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్లు’ అని చెప్పారు.
అపొస్తలుల కార్యములు 7:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 7:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.
అపొస్తలుల కార్యములు 7:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై –నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పారు.