2 పేతురు 1:5-7
2 పేతురు 1:5-7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దీనిబట్టే, మీ విశ్వాసానికి మంచితనాన్ని; మంచితనానికి వివేకాన్ని; వివేకానికి స్వీయ నియంత్రణ; స్వీయ నియంత్రణకు సహనాన్ని; సహనానికి దైవ భక్తిని; దైవ భక్తికి సోదర భావాన్ని; సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి.
2 పేతురు 1:5-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి.
2 పేతురు 1:5-7 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి.
2 పేతురు 1:5-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.