1 సమూయేలు 3:1-18

1 సమూయేలు 3:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి –నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అనిపిలువగా సమూయేలు–నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను. అయితే ఏలీ–సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు– చిత్తము నేనిక్కడ ఉన్నాననెను. ఏలీ–నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని–సెలవిచ్చినవాడు యెహోవా; తన దృిష్టికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 3

1 సమూయేలు 3:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

బాలుడైన సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వచ్చేది; దర్శనాలు ఎక్కువగా ఉండేవి కావు. ఒక రాత్రి, కళ్ళు మసకబారి స్పష్టంగా చూడలేకపోతున్న ఏలీ, తాను ఎప్పుడు పడుకునే స్థలంలో పడుకుని ఉన్నాడు. అదే సమయంలో యెహోవా దీపం ఆరిపోక ముందు, యెహోవా మందిరంలో దేవుని మందసం ఉన్నచోట సమూయేలు పడుకుని ఉన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచారు. అందుకు సమూయేలు, “నేను ఇక్కడే ఉన్నాను” అంటూ, అతడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు నన్ను పిలిచారా? నేను ఇక్కడే ఉన్నాను” అని అన్నాడు. అందుకు ఏలీ, “నేను పిలువలేదు; వెళ్లి పడుకో” అని చెప్పగానే అతడు వెళ్లి పడుకున్నాడు. మళ్ళీ యెహోవా, “సమూయేలూ!” అని పిలిచారు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. అయితే ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; వెళ్లి పడుకో” అన్నాడు. అప్పటికి సమూయేలుకు ఇంకా యెహోవా తెలియదు; యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవసారి, “సమూయేలూ!” అని పిలిచినప్పుడు, అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. యెహోవాయే ఆ బాలుని పిలిచారని ఏలీ గ్రహించాడు. కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు. తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు. వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పారు: “ఇశ్రాయేలీయులలో నేను ఒక పని చేయబోతున్నాను; దాని గురించి విన్నవారి చెవులు గింగురుమంటాయి. ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు. కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.” తర్వాత సమూయేలు ఉదయమయ్యే వరకు పడుకుని లేచి, యెహోవా మందిర తలుపులను తెరిచాడు. అయితే తనకు వచ్చిన దర్శనం గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు. కాని ఏలీ సమూయేలును, “సమూయేలూ, నా కుమారుడా” అని పిలిచాడు. అందుకు సమూయేలు, “నేనిక్కడే ఉన్నాను” అన్నాడు. అప్పుడు ఏలీ, “యెహోవా నీతో ఏమి చెప్పారు? వాటిలో ఏదీ నా దగ్గర దాచవద్దు. ఆయన నీతో చెప్పిన సంగతుల్లో ఏదైనా నీవు దాచిపెడితే దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు. కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 3

1 సమూయేలు 3:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు. ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు. దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు “అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను” అన్నాడు. ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి “నన్ను పిలిచావు గదా, వచ్చాను” అన్నాడు. ఏలీ “నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు. యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి “అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను” అన్నాడు. అందుకు అతడు “బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అని చెప్పాడు. అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి “అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను” అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు. అతడు “నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, ‘యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి’ అని చెప్పు” అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా “సమూయేలూ సమూయేలూ” అని పిలిచినప్పుడు సమూయేలు “నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి” అన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి. ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను. తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.” తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు. అయితే ఏలీ “సమూయేలూ, కుమారా” అని సమూయేలును పిలిచాడు. అతడు “చిత్తం, నేనిక్కడ ఉన్నాను” అన్నాడు. ఏలీ “నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక” అనగా, సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ “చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక” అన్నాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 3

1 సమూయేలు 3:1-18 పవిత్ర బైబిల్ (TERV)

ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు. ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు. దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు. మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు. యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు. తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు. “చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు. యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు. నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు. అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.” తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు. “ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు. “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు. దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు. అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.