1 దినవృత్తాంతములు 4:9-22
1 దినవృత్తాంతములు 4:9-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను. ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను. మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు. ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను. అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును యోకీ మీయులకును కోజేబాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూబిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
1 దినవృత్తాంతములు 4:9-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యబ్బేజు తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు. కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి. ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు. కెనజు కుమారులు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలు కుమారులు: హతతు, మెయానొతై. మెయానొతై ఒఫ్రాకు తండ్రి. శెరాయా యోవాబుకు తండ్రి, యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు: ఈరూ, ఏలా, నయము, ఏలా కుమారుడు: కనజు. యెహల్లెలేలు కుమారులు: జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు. ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు. మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే. యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు. నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు: గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను. ఇషీ సంతానం: జోహేతు, బెన్-జోహేతు. యూదా కుమారుడైన షేలా కుమారులు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు, యోకీము, కోజేబా వారు, యోవాషు, శారాపు, మోయాబులో, యాషూబిలెహెములో పరిపాలన చేశారు. (ఇవి పూర్వకాలంలో వ్రాసి పెట్టిన సంగతులు.)
1 దినవృత్తాంతములు 4:9-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను” అని చెప్పింది. ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు. “నువ్వు నన్ను కచ్చితంగా ఆశీర్వదించు. నా భూభాగాన్ని విశాలం చెయ్యి. నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు.” దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు. షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎష్తోను. ఎష్తోను కొడుకులు బేత్రాఫా, పాసెయా, తెహిన్నా అనే వాళ్ళు. ఈ తెహిన్నా ఈర్నాహాషుకు తండ్రి. వీళ్ళు రేకాకు చెందిన వాళ్ళు. కనజు కొడుకుల పేర్లు ఒత్నీయేలు శెరాయా. ఒత్నీయేలు కొడుకుల్లో హతతు అనే ఒకడుండేవాడు. మెయానొతైకి ఒఫ్రా పుట్టాడు. శెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతి వృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. ఆ లోయలో ఉన్న వాళ్ళంతా చేతిపనుల వాళ్ళే. యెఫున్నె కొడుకైన కాలేబుకు ఈరు, ఏలా, నయం పుట్టారు. ఏలా కొడుకుల్లో కనజు అనే వాడున్నాడు. యెహల్లెలేలు కొడుకులు జీఫు, జీఫా, తీర్యా, అశర్యే. ఎజ్రా కొడుకులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. ఐగుప్తీయురాలూ, ఫరో కూతురూ అయిన బిత్యా ద్వారా మెరెదుకు పుట్టిన కొడుకులు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో, ఇష్బాహు అనేవాళ్ళు. ఈ ఇష్బాహు ఎష్టేమోను వాళ్లకి తండ్రి. యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన యెరెదు, శోకోకు తండ్రి అయిన హెబెరు, జానోహకు తండ్రి అయిన యెకూతీయేలు పుట్టారు. నహము సోదరీ హూదీయా భార్యా అయిన ఆమెకు పుట్టిన కొడుకుల్లో ఒకడు గర్మీ వాడు కెయిలాకు తండ్రి. మరొకడు మాయకాతీయుడైన ఎష్టేమో. షీమోను కొడుకులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోనులు. ఇషీ కొడుకులు జోహేతు, బెన్జోహేతులు. యూదా కొడుకైన షేలహు కొడుకులు ఎవరంటే లేకాకు తండ్రియైన ఏరు, మారేషాకు తండ్రీ, బేత్ ఆష్బియాలో సన్నటి వస్త్రాలు నేసే వారికి మూలపురుషుడైన లద్దాయు, యోకిం, కోజేబా సంతతి, యోవాషు సంతతి, మోయాబులో ప్రసిద్ధులై బెత్లేహెంకు తిరిగి వచ్చిన శారాపీయులూ. ఇవన్నీ పూర్వకాలంలోనే రాసి ఉన్న సంగతులే.
1 దినవృత్తాంతములు 4:9-22 పవిత్ర బైబిల్ (TERV)
యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు. కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను. ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు. వారంతా రేకా నుండి వచ్చిన వారు. కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకు హతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు. మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా. శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు. యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు. ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య. మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ. మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా, ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను. ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు. యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు. ఈ వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి.
1 దినవృత్తాంతములు 4:9-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను. ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను. మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు. ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను. అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును యోకీ మీయులకును కోజేబాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూబిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
1 దినవృత్తాంతములు 4:9-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)